స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress
AMMA-DATE:1964-06-12 ఎమ్. సుగుణ M. Suguna ఆంధ్రపత్రిక వారపత్రిక · 12 జూన్ 1964 · పేజీలు 14–15 · వనితాలోకం ‘ప్రత్యేక వ్యాసావళి’లో నాలుగవ వ్యాసం Andhra Patrika weekly · 12 June 1964 · pp. 14–15 · Vanitalokam, fourth essay in the “Special Essay Series” స్త్రీల వస్త్రధారణ విషయమై వ్యాసం వ్రాయమని అడిగినప్పుడు కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం. “పురుషులలో రకరకాల దుస్తులు వస్తున్నాయి” అని కూడా అన్నారు కదా! మన స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం తక్కువనీ, స్త్రీల విషయంలో మార్పు అసంభవమా? అని కూడా ప్రశ్నించారు. అసంభవమన్నది లేదు. ఎందుకంటారా? వస్త్రధారణ అన్నది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు వేసుకోవచ్చును. కానీ వారికి కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ఉండాలి. ఉదా: [పరడా] కొడ్డీ పంజాబీ దుస్తులు వేసుకున్నామనుకోండి. అవి వేసుకుని బజారుకో, కాలేజీకో వెళితే వెనక నుంచి వచ్చే సూటిపోటి మాటలు, వేళాకోళాలు, పరిహాసాలు అన్నీ సహింపగల ధైర్యం ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇందులో ఒక సంఘటన చెబుతానా?... పంజాబ్‌లో మేమున్న ఊళ్ళో మేమొక్కరమే తెలుగు వారము. వెళ్ళిన కొత్తలో మా చెల్లెలు పావడా, ఓణీ వేసుకుని రిక్షాలో స్కూల్‌కి వెళ్త...