స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress
Hinduism is a word that does not belong to the tradition it stands for. It is a word that others have given to the people who have lived on the land that is shaped like a जंबू Jambu (Rose Apple). This land, bounded by mountains on the north and the ocean on three sides, has been known as भारतवर्ष (Bharatavarsha) for as long as the cultural memory of its people can go back. The first principles that shaped the Sanatana culture are timeless. My aim is जिज्ञासा - explore their relevance today.
ఎన్. సుగుణ (హిస్సార్, తూర్పుపంజాబ్)
ఆంధ్రపత్రిక వారపత్రిక · 13-11-1957
పంజాబీలు ఆరోగ్యం, బలము కలిగి చాలా అందంగా ఉంటారు. అందుకు కారణం వాళ్ళ భోజనమే అనాలి. వాళ్ళకీ మనకీ చాలా భేదం ఉంది. వాతావరణానికి తగినట్లుగా భోజన పానీయాలుండాలి. అలాగ లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన ప్రక్క రెండుపూట్లా అన్నం తింటే వంటికి పడుతుంది. కాని ఇటుప్రక్క (ఉత్తర దేశంలో) అన్నంకంటే గోధుమ రొట్టెలు తింటేనే ఆరోగ్యంగా బావుంటారు.
ఇటుప్రక్క వారి ఆహారం చాలా బలమయినది. మన ఆహారానికీ, ఇటుప్రక్క వారి ఆహారానికీ ఎంత భేదం ఉందో రాస్తాను. మనం అన్నం తింటాము. వాళ్లు రొట్టెలు తింటారు. ఈ రెండిట్లోకీ గోధుమ రొట్టెలు చాలా బలమయినవి. అన్నం అంత బలమయినది కాదు. అందులోనూ మనలో చాలామంది అన్నం వారుస్తారు. అలా వార్చకూడదు. వార్చి అన్నంలో సారమంతా పోయి పిప్పి మిగులుతుంది.
పప్పు బలమైనది. అందులో పొట్టు ఉన్న పప్పులు చాలా బలమయినవి. ఇక్కడివారు ఆ పొట్టుపప్పులనే ఎక్కువగా తింటారు. ఇంక, కాయకూరలు. అవి మనం ఉడికించి వార్చి, అందులో అన్నీ వేసి వండుకుంటాము. కూరలు వార్చినా, సారంపోతుంది. ఇక్కడివారు వార్చి వండిన కూరలు చాలా తక్కువ తింటారు. ఇవి కాక పచ్చికూరలు విరివిగా తింటారు. పచ్చికూరల్లో ఎక్కువ విటమిన్లుంటాయన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పటికి వాళ్ళ ఆహారానికి మన ఆహారానికి పోల్చి చూస్తే మనం తిన్నది ఏమీ లేదనిపిస్తుంది. అందునుండి మనంకూడా పచ్చికూరలు తినటం అలవాటు చేసుకుంటే వంటికి చాలా మంచిది. ఏవి ఎలా తినాలో ఈ క్రింద రాస్తాను.
కొన్ని కూరలు పచ్చివి తినడానికి రుచిగా ఉంటాయి. అవేమిటంటే ముల్లంగి దుంపలూ, క్యారట్, బీట్‌రూట్, టొమాటో, లెట్యూస్ ఆకులూ, దోసకాయలూ (చిన్నవి). ఇవి సాధారణంగా అన్ని ప్రాంతాలలోనూ దొరికేవి. ఇవి కాక ఇటుప్రక్క రేడిష్ (ముల్లంగి) అని చిన్న దుంపలు దొండకాయ సైజున కుంకుమ రంగుతో ఉంటాయి. చెరువుల్లో ‘సింగాడా’ అని ఒక రకమయిన కాయలు తియ్యగా ఉంటాయి. పైన చెప్పిన కూరలన్నీ ఇటుప్రక్క ప్రతిరోజూ తింటారు. ఇవి తాజాగా ఉన్నవి తెచ్చి బాగా కడిగి సన్నగా పైచెక్కు తీసి తినవచ్చును. ముల్లంగి దుంపలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఉప్పు అద్దుకు తినవచ్చును. టొమాటో, దోసకాయలు, బీట్‌రూట్, క్యారెట్, ఇవి కొన్ని పుల్లగా కొన్ని తియ్యగా ఉంటాయి కాబట్టి పచ్చివే తినవచ్చును. ఇవి రోజూ తింటే బలం; అందరూ కొనుక్కోగలరు.
అన్ని రకాలు ఒక్కరోజే కాకపోయినా రోజుకి ఒకటి రెండు రకాలు తింటే మంచిది. ఈ రోజుల్లో చాలా చవగ్గా అమ్ముతారు. ఈ కూరలు గాజుప్లేట్లలో అందంగా అమర్చి పెడితే చూసిందికి అందంగా ఉండి తినాలని బుద్ధి పుడుతుంది, నోరూరుతుంది.
ఇటుప్రక్క ఎవరింటికేనా భోజనానికి వెళ్తే వాళ్ళ డైనింగ్ టేబిల్ చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. అంటే అంత అందంగా అలంకరిస్తారు. ఆ టేబిల్ మీద ఉన్న వస్తువుల్ని ఒక కలర్ ఫోటో తీస్తే చూట్టానికి ఎంతో బాగుంటుంది. కొన్ని పత్రికల్లో వేస్తూ ఉంటారుకూడా. చూసిందికి ఎన్నో రకాల పదార్థాలు కనిపిస్తాయి వివిధ రంగుల్లో. కాని వాటిలో చాలా పదార్థాలు వండకుండానే చుట్టూ అమరుస్తారు.
ఈమధ్య ఒక ఫ్రెండింటికి భోజనానికి వెళ్లేము. ఆవిడ రెండుకూరలూ, పప్పు, రొట్టెలు, అన్నం, హల్వా చేసి ఇవేమో కంచంలోపల, కటోరీల్లో (చిన్నగిన్నెలు) ఉన్నాయి. ఇవి కాక, కంచంచుట్టూ ఓ డజను చిన్న గాజుప్లేట్లలో ఈ పచ్చికూరలూ, ఆవకాయ మొ॥ ఉన్నాయి. ఒక గాజుప్లేటులో ముల్లంగి, ఇంకోదాంట్లో కేరట్లూ ఇలా ఒక్కొక్క ప్లేటులో ఒక్కొక్క రకం కోసి పెట్టింది.
ఇవి కాక పెద్ద గాజుప్లేటులో అన్ని రకాల కూరలు కలిపి అందమయిన డిజైను మాదిరి అలంకరించింది. ఎలా అంటే గాజుప్లేటులో లేత లెట్యూస్ ఆకులు అన్నీ ఒకే సైజువి పేర్చింది. (లెట్యూస్ ఆకులతో శాండ్‌విచెస్ చేసుకునికూడా తినవచ్చును.) లేత ఆకుల మధ్య ఎర్రగా చక్రం మాదిరి కోసిన టొమాటో మధ్యగింజల్లో రమాపాగా ఉన్నాయి. టొమాటో చుట్టూ బిళ్లల మాదిరి కోసిన ముల్లంగి, కేరట్, బీట్‌రూట్ కోసి అన్నీ అందంగా, రంగులు కొట్టొచ్చినట్టు పేర్చింది. మధ్యమధ్య ఉల్లిపాయ చీలికలూ, అల్లం, పచ్చిమిరపముక్కలు చల్లింది. ఇలా అన్ని రంగుల్లోనూ లేత కూరలు కనిపిస్తే ఎప్పుడూ పచ్చికూరలు తినని మా అమ్మగారు కూడా ఆరోజు తిన్నారు. ఆమె చేసిన అలంకర…
Comments
Post a Comment