స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress
Hinduism is a word that does not belong to the tradition it stands for. It is a word that others have given to the people who have lived on the land that is shaped like a जंबू Jambu (Rose Apple). This land, bounded by mountains on the north and the ocean on three sides, has been known as भारतवर्ष (Bharatavarsha) for as long as the cultural memory of its people can go back. The first principles that shaped the Sanatana culture are timeless. My aim is जिज्ञासा - explore their relevance today.
ఎన్. సుగుణ (హిస్సార్, తూర్పుపంజాబ్)
N. Suguna (Hissar, East Punjab)
ఆంధ్రపత్రిక వారపత్రిక · 27 మార్చి 1957
Andhra Patrika weekly · 27 March 1957
పంజాబీలు అతిథుల్ని ఆదరించటములోనూ, మర్యాద చేయటములోను మొదటిస్థానం ఆక్రమిస్తారనుకుంటాను. వాళ్ళ ఆదరణలో సగంవంతున్నా మనకు చాలనిపిస్తుంది. ఎవరేనా ఇంటికి వెళ్లడమే తడవు “రండి, కూర్చోండి, చా, సికంజి (షర్బత్) ఏవి కావా”లని అడుగుతారు. మనం వద్దంటే ఆకాలానుగుణంగా ఏదో ఒక పానీయం తెచ్చిస్తారు. వాళ్ళ మాటల్లో ఆదరణ అపేక్ష బాగా కనబడతాయి, హాయి అనిపిస్తాయి. ముఖపరిచయము లేకపోతే, ఫలానా అని పరిచయం చేసినా చాలు వాళ్ళు ఒక్కలాగే ఆదరిస్తారు. ఉదాహరణకి ఒకటి, రెండు ఈ కింద వ్రాస్తాను.
మేము ఢిల్లీలో పదేళ్ళు ఉన్నాము లెండి. ఇప్పుడు 102 మైళ్ళ దూరంలో ఉన్నాము ఢిల్లీకి. ఒకసారి నేను, మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి పంజాబీల ఇంట్లో బసచేశాము. ఇంటామెని రెండు మూడుసార్లు చూసుంటాను అంతే. వాళ్ళింట్లో ఉన్నది సరిగా మూడుపూటలే. అయినా తరవాత ఆమెని ఎన్నోసార్లు తల్చుకున్నాము.
మేము బెడ్డింగ్ పట్టుకొని వెళ్లినా ఆమె విప్పనివ్వలేదు. పైగా దెబ్బలాడింది. “ఒక్కరోజుకోసమని ఇంత సామాను ఎందుకని? మాది ఇల్లు కాక అడవనుకున్నారా?” మంచాలు, పరుపులు, కప్పుకునేందుకు రజాయిలు (ఇటుప్రక్క కప్పుకునే పరుపులు) మొదలుకొని ఇంట్లో వాడుకొనే స్లిప్పర్లు వరకూ సప్లయి చేసింది. భోజనానికి కూడ ఆమె ప్రతీదీ అడిగి వండింది. (ఎందుకంటే మద్రాసీలమని) ఏమిటి తింటామో ఏమి తినమో అని ఆమె భయం.
అందరూ ఇలా చెయ్యగలుగుతారా? అని అడగవచ్చు. ఇలా కాకపోయినా కొంచెమేనా మనం నేర్చుకోవచ్చును. పంజాబీలలో చాలామంది ఇలాగే చేస్తారు. ఎందుకంటే మేము చాలాసార్లు పంజాబీల ఇళ్ళల్లో ఆతిథ్యం పొందేము. ఎవరింటికి వెళ్లినా కట్టుకొనే బట్టలు తప్పించి మిగిలిన ఏసామాను తెచ్చుకున్నది మేము ఉపయోగించుకోలేదు. అన్నీ వాళ్లే సప్లై చేశారు. వీరిలో గొప్పా బీదా లేదు అందరూ ఒక్కలాగే ఆదరిస్తారు.
Comments
Post a Comment