Posts

Showing posts from November, 2026

స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress

Image
AMMA-DATE:1964-06-12 ఎమ్. సుగుణ M. Suguna ఆంధ్రపత్రిక వారపత్రిక · 12 జూన్ 1964 · పేజీలు 14–15 · వనితాలోకం ‘ప్రత్యేక వ్యాసావళి’లో నాలుగవ వ్యాసం Andhra Patrika weekly · 12 June 1964 · pp. 14–15 · Vanitalokam, fourth essay in the “Special Essay Series” స్త్రీల వస్త్రధారణ విషయమై వ్యాసం వ్రాయమని అడిగినప్పుడు కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం. “పురుషులలో రకరకాల దుస్తులు వస్తున్నాయి” అని కూడా అన్నారు కదా! మన స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం తక్కువనీ, స్త్రీల విషయంలో మార్పు అసంభవమా? అని కూడా ప్రశ్నించారు. అసంభవమన్నది లేదు. ఎందుకంటారా? వస్త్రధారణ అన్నది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు వేసుకోవచ్చును. కానీ వారికి కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ఉండాలి. ఉదా: [పరడా] కొడ్డీ పంజాబీ దుస్తులు వేసుకున్నామనుకోండి. అవి వేసుకుని బజారుకో, కాలేజీకో వెళితే వెనక నుంచి వచ్చే సూటిపోటి మాటలు, వేళాకోళాలు, పరిహాసాలు అన్నీ సహింపగల ధైర్యం ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇందులో ఒక సంఘటన చెబుతానా?... పంజాబ్‌లో మేమున్న ఊళ్ళో మేమొక్కరమే తెలుగు వారము. వెళ్ళిన కొత్తలో మా చెల్లెలు పావడా, ఓణీ వేసుకుని రిక్షాలో స్కూల్‌కి వెళ్త...

స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress

Image
AMMA-DATE:1964-06-12 ఎమ్. సుగుణ M. Suguna ఆంధ్రపత్రిక వారపత్రిక · 12 జూన్ 1964 · పేజీలు 14–15 · వనితాలోకం ‘ప్రత్యేక వ్యాసావళి’లో నాలుగవ వ్యాసం Andhra Patrika weekly · 12 June 1964 · pp. 14–15 · Vanitalokam, fourth essay in the “Special Essay Series” స్త్రీల వస్త్రధారణ విషయమై వ్యాసం వ్రాయమని అడిగినప్పుడు కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం. “పురుషులలో రకరకాల దుస్తులు వస్తున్నాయి” అని కూడా అన్నారు కదా! మన స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం తక్కువనీ, స్త్రీల విషయంలో మార్పు అసంభవమా? అని కూడా ప్రశ్నించారు. అసంభవమన్నది లేదు. ఎందుకంటారా? వస్త్రధారణ అన్నది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు వేసుకోవచ్చును. కానీ వారికి కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ఉండాలి. ఉదా: [పరడా] కొడ్డీ పంజాబీ దుస్తులు వేసుకున్నామనుకోండి. అవి వేసుకుని బజారుకో, కాలేజీకో వెళితే వెనక నుంచి వచ్చే సూటిపోటి మాటలు, వేళాకోళాలు, పరిహాసాలు అన్నీ సహింపగల ధైర్యం ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇందులో ఒక సంఘటన చెబుతానా?... పంజాబ్‌లో మేమున్న ఊళ్ళో మేమొక్కరమే తెలుగు వారము. వెళ్ళిన కొత్తలో మా చెల్లెలు పావడా, ఓణీ వేసుకుని రిక్షాలో స్కూల్‌కి వెళ్త...

ఉత్తర భారత్‌లోని ముఖ్యమైన పండుగలు · The Major Festivals of North India

Image
AMMA-DATE:1963-11-01 ఎం. సుగుణ ఆంధ్రపత్రిక వారపత్రిక · 1-11-1963 · వనితాలోకం పండుగ వస్తోందంటే చాలా ఆబాలగోపాలానికీ సంతోషమే. రోజులు లెక్కిస్తుంటారు. పండుగ ఎప్పుడొస్తుందా అని, అన్నిభాషలవారూ ఎదురుచూస్తారు కదా! కాని, ఆ జరిపే తీరే వేరుగా ఉంటాయి. వారి ఆచారాన్ని అనుసరించి. మనకి ముఖ్య పండుగ సంక్రాంతి తరువాత దీపావళి, దసరా, ఉగాది మొదలగునవి. ఉత్తర దేశంలో ముఖ్యమైన పండుగలు నాలుగు. దసరా, దీపావళి, హోళీ, రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అన్నది మన శ్రావణ పౌర్ణమి. పండుగలు ఎలా జరుపుతారో రాస్తాను. ముందుగా దసరా పండుగ. దసరా పండుగ మనలాగా బొమ్మలకొలువు పేరంటం ఉండదు. అసలు ఇళ్ళల్లో అట్టహాసమే ఉండదు. పైగా కొంతమంది ఏ ప్రాంతానికా ప్రాంతంవారు (కోలనీ) చందాలు వేసుకొని ఎలాగేనా సరే “రామ్‌లీలా” ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా అంటే రామాయణ గాథనే వేదికమీద ప్రదర్శిస్తారన్నమాట. ఢిల్లీలో ఈ రామ్‌లీలా కోసమని రామ్‌లీలా మైదాన్ అనే పెద్ద మైదానం ఉంది. అక్కడ ‘రామ్‌లీల’ ని సుమారు లక్షమంది ప్రజ చూస్తారేమో! ఈ రామ్‌లీలాకి చాలా ధనం వ్యయం చేస్తారు. మొదటిరోజు విఘ్నేశ్వరపూజ మొదలుకొని, రామలక్ష్మణులు విద్యనభ్యసించటం, సీతా పరిణయం, అన్నీ రోజూ రామాయణకథ మొత్త...

పంజాబ్ పకోడీ · Punjab Pakodi (Punjabi Fritters)

AMMA-DATE:1964-07-24 ఎం. సుగుణ ఆంధ్రపత్రిక వారపత్రిక · 24-7-1964 పంజాబ్, ఉత్తరప్రదేశం అంతా పకోడీలు పలువిధాలుగా చేసుకుంటారు. ఇంక పకోడీల వ్యాపారం ఉన్న వాళ్ళకి బలే గిరాకీ…. ఈ పకోడీల షాపులు అడుగడుక్కీ కనిపిస్తూంటాయి. పెద్ద హోటళ్ళ దగ్గర్నుండీ, ఠేలా (తోపుడు బళ్ళ)లో పకోడీల సరంజామా అంతా కుదుర్చుకుని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న వ్యాపారి వరకూ రకరకాల పకోడీలు ‘ఛుయ్….’ ‘ఛుయ్….’ ముంచివేస్తుండటమే పని…. ఆ వేడివేడి పకోడీలు అలా చూస్తుండగానే చెల్లిపోతాయి. ఠేలాతో వ్యాపారం అయిందా? ఇంక అంబరిల్లా విలాస్‌లు (గొడుగు కింద పకోడీల వ్యాపారం) కోకొల్లలు. వీళ్ళు ఎన్ని రకాల పకోడీలు చేస్తారో చెప్పలేను. ఆ ప్రక్క నుండి వెళ్ళిన వారికి ఘుమ ఘుమ వాసనలతో నోరూరించటమే కాకుండా, అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. ఆ దేశం వారు మనలాగా నడిరోడ్డుమీద నిలబడి తినటానికి సిగ్గు పడరు. పెద్ద కార్లకూడా ఆపి గరమ్ పకోడా తిని మరీ వెళ్తారు. పెద్ద పార్టీలలో ఈ పకోడీల వ్యాపారిని ఠేకా (కంట్రాక్టు) తీసుకుని ఇళ్ళల్లో చేయిస్తుంటారు. ఈ పకోడీలు మన ప్రక్కలా పొట్లాలు కట్టి అమ్మరు. ఎక్కువగా కావాలంటే తూచి అమ్ముతారు. చాలా రకాల పకోడీలన్నాను కదూ! నోరూరుతోందా? అయితే చేసి చూ...

పచ్చికూరల ప్రాముఖ్యం: పంజాబీల ఆహారం · The Importance of Raw Vegetables: The Food of the Punjabis

AMMA-DATE:1957-11-13 ఎన్. సుగుణ (హిస్సార్, తూర్పుపంజాబ్) ఆంధ్రపత్రిక వారపత్రిక · 13-11-1957 పంజాబీలు ఆరోగ్యం, బలము కలిగి చాలా అందంగా ఉంటారు. అందుకు కారణం వాళ్ళ భోజనమే అనాలి. వాళ్ళకీ మనకీ చాలా భేదం ఉంది. వాతావరణానికి తగినట్లుగా భోజన పానీయాలుండాలి. అలాగ లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన ప్రక్క రెండుపూట్లా అన్నం తింటే వంటికి పడుతుంది. కాని ఇటుప్రక్క (ఉత్తర దేశంలో) అన్నంకంటే గోధుమ రొట్టెలు తింటేనే ఆరోగ్యంగా బావుంటారు. ఇటుప్రక్క వారి ఆహారం చాలా బలమయినది. మన ఆహారానికీ, ఇటుప్రక్క వారి ఆహారానికీ ఎంత భేదం ఉందో రాస్తాను. మనం అన్నం తింటాము. వాళ్లు రొట్టెలు తింటారు. ఈ రెండిట్లోకీ గోధుమ రొట్టెలు చాలా బలమయినవి. అన్నం అంత బలమయినది కాదు. అందులోనూ మనలో చాలామంది అన్నం వారుస్తారు. అలా వార్చకూడదు. వార్చి అన్నంలో సారమంతా పోయి పిప్పి మిగులుతుంది. పప్పు బలమైనది. అందులో పొట్టు ఉన్న పప్పులు చాలా బలమయినవి. ఇక్కడివారు ఆ పొట్టుపప్పులనే ఎక్కువగా తింటారు. ఇంక, కాయకూరలు. అవి మనం ఉడికించి వార్చి, అందులో అన్నీ వేసి వండుకుంటాము. కూరలు వార్చినా, సారంపోతుంది. ఇక్కడివారు వార్చి వండిన కూరలు చాలా తక్కువ తింటారు. ఇవి కాక ప...

పంజాబీ వంటకాలు · Punjabi Dishes

AMMA-DATE:1957-05-08 ఎన్. సుగుణ (హిస్సార్, తూర్పుపంజాబ్) N. Suguna (Hissar, East Punjab) ఆంధ్రపత్రిక వారపత్రిక · 8 మే 1957 · పేజీలు 36, 42 Andhra Patrika weekly · 8 May 1957 · pp. 36 and 42 పంజాబీల వంటకాలన్నీ పుష్టికరమైనవీ రుచికరమైనవీను. కొన్ని మనకి తెలియని వంటలుంటాయి. ఇటుప్రక్క వారంతా గోధుమ రొట్టెలు తింటారని అందరికీ తెలుసు. మన ప్రక్క కూడా కొందరు ఒకపూట రొట్టెలు తినటం అందరికీ తెలిసిన విషయమే. కాని అందులోకి కావలసిన కూరలు మనకంటే ఇక్కడివారికే బాగా చేతవును. మనం పెసర, కంది, సెనగ పప్పులను మాత్రమే వండుకుంటాము. అవయినా పొట్టుతీసి వేసిన పప్పులనే వాడుతాము. ఇక్కడలా కాదు. అన్నీ పొట్టుతోనే వండుకుంటారు. సర్వసాధారణంగా ఇక్కడ వాడుకొనేది పొట్టుమినపప్పు లేక మినుములు. వీటితో పప్పు చేస్తారు. వారానికి రెండు మూడుసార్లు గింజ సరుకులు, సెనగలు, పెసలు, మినుములు మొదలగు అన్నీ గింజ సరుకులూ వండుకుంటారు. ఇవన్నీ బలమైనవే. పంజాబీల స్పెషల్స్‌లో ఒకటి ‘ఛోలే’ అంటే సెనగలకూర. ఛోలే అంటే వారికి ప్రాణం. ఇది ఎలా చేస్తారో ఈ క్రింద చెపుతాను. కావలసిన సామానులు:– ¼ పావు మినుములు (మినపప్పుకంటే మినుములే రుచిగా ఉంటాయి), పొట్టుతీసిన సెనగపప్ప...

పంజాబీల అతిథి మర్యాదలు · Punjabi Hospitality

AMMA-DATE:1957-03-27 ఎన్. సుగుణ (హిస్సార్, తూర్పుపంజాబ్) N. Suguna (Hissar, East Punjab) ఆంధ్రపత్రిక వారపత్రిక · 27 మార్చి 1957 Andhra Patrika weekly · 27 March 1957 పంజాబీలు అతిథుల్ని ఆదరించటములోనూ, మర్యాద చేయటములోను మొదటిస్థానం ఆక్రమిస్తారనుకుంటాను. వాళ్ళ ఆదరణలో సగంవంతున్నా మనకు చాలనిపిస్తుంది. ఎవరేనా ఇంటికి వెళ్లడమే తడవు “రండి, కూర్చోండి, చా, సికంజి (షర్బత్) ఏవి కావా”లని అడుగుతారు. మనం వద్దంటే ఆకాలానుగుణంగా ఏదో ఒక పానీయం తెచ్చిస్తారు. వాళ్ళ మాటల్లో ఆదరణ అపేక్ష బాగా కనబడతాయి, హాయి అనిపిస్తాయి. ముఖపరిచయము లేకపోతే, ఫలానా అని పరిచయం చేసినా చాలు వాళ్ళు ఒక్కలాగే ఆదరిస్తారు. ఉదాహరణకి ఒకటి, రెండు ఈ కింద వ్రాస్తాను. మేము ఢిల్లీలో పదేళ్ళు ఉన్నాము లెండి. ఇప్పుడు 102 మైళ్ళ దూరంలో ఉన్నాము ఢిల్లీకి. ఒకసారి నేను, మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి పంజాబీల ఇంట్లో బసచేశాము. ఇంటామెని రెండు మూడుసార్లు చూసుంటాను అంతే. వాళ్ళింట్లో ఉన్నది సరిగా మూడుపూటలే. అయినా తరవాత ఆమెని ఎన్నోసార్లు తల్చుకున్నాము. మేము బెడ్డింగ్ పట్టుకొని వెళ్లినా ఆమె విప్పనివ్వలేదు. పైగా దెబ్బలాడింది. “ఒక్కరోజుకోసమని ఇంత సామాను ఎందుకని? మాద...